May 12, 2025

Digital Mixture

Information Portal

ఈ వారం థియేటర్/OTTలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సీరిస్లు- This week Theatre and OTT movie release

1 min read
This Week Movie Releases Theater, OTT

This Week Movie Releases Theater, OTT

మహారాజా రవితేజ రావాణాసుర, రావాణాసుర తెలుగు సినిమా, మీటర్ తెలుగు మూవీ, మాస్ మహారాజా రవితేజ, తెలుగు మూవీస్, OTT Movies, Mass Maharaja Raviteja, Raviteja Ravanasura, Meter Telugu movie, Netflix, Zee5, Disney + Hotstar, Book my Show, Amazon prime Video,
Ravanasura Raviteja

ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలో అలాగే OTT లలో పలు సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది మాస్ మహారాజా రవితేజ రావాణాసుర (Ravanasura). రవితేజ (Raviteja) నటించిన ధమాకా, వాలేరు వీరయ్య సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు రానణాసురతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ చిత్రం ఏప్రియల్ 7 వ తేదిన ప్రేక్షకుల ముందుకు థియేటర్లో రాబోతోంది. ఈ సినిమాకి సుదీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్షా నగర్కర్ రవితేజ కి జోడీగా నటించారు. ఇందులో కీలక పాత్రలో అక్కినేని సుశాంత్ నటించారు.

మహారాజా రవితేజ రావాణాసుర, రావాణాసుర తెలుగు సినిమా, మీటర్ తెలుగు మూవీ, మాస్ మహారాజా రవితేజ, తెలుగు మూవీస్, OTT Movies, Mass Maharaja Raviteja, Raviteja Ravanasura, Meter Telugu movie, Netflix, Zee5, Disney + Hotstar, Book my Show, Amazon prime Video,
Meter

ఈ వారమే యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ (Meter) సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల వినరో భాగ్యము విష్ణుకథ (Vinaro Bhagyamu Vishnukatha) సినిమాతో మనముందుకు వచ్చి మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాని పూర్తిగా మరిచిపోకముందే వెంటనే కొత్త సినిమా మీటర్ (Meter) తో మనముందుకు రాబోతున్నాడు. రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పోలీస్ నేపథ్యంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు ఈనెల 7 వ తెదీన థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం లో అతుల్య రవి కథానాయికగా నటించింది.

వీటితో పాటు అనువాద చిత్రాలు కూడా థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.

ప్రముఖ దర్శకుడు ఏ. ఆర్. మురుగదాస్ (A.R. Murugadas)నిర్మిస్తున్న చిత్రం ఆగస్టు 16, 1947. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాను  ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 7 వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది.

అలాగే మరొక మలయాళ చిత్రం రోమాంచమ్ (Rmancham). ఈ సినిమా మలయాళం లో మంచి విజయాన్ని అందుకొని తెలుగులో ఈ నెల 7 వ తేదిన విడుదల అవుతోంది. ఈ చిత్రానికి జీతు మాదవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 7 వ తేదీ నుండి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి సిద్దంగా ఉంది.

అతిధి రావు హైదరీ కీల పాత్రలో నటించిన వెబ్ సీరిస్ జూబ్లీ (Jubilee). ఈ సీరిస్ ని విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సీరిస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో 7 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.

వీటితో పాటు

Netflix

బీఫ్ (వెబ్ సీరిస్)- ఏప్రిల్ 6

ఇన్ రీయల్ లవ్ (టీవి షో ) ఏప్రిల్ 6

చుపా (హాలీవుడ్ ) ఏప్రిల్ 7

హంగర్ (హాలీవుడ్) ఏప్రిల్ 8

Zee 5

అయోథి (తమిళం) ఏప్రిల్ 7

Disney+ Hotstar

డి క్రాస్ ఓవర్ (వెబ్ సీరిస్) ఏప్రిల్ 4

Book my Show

బ్యాట్ మ్యాన్ (హాలీవుడ్ ) ఏప్రిల్ 5

కాస్మోస్ (హాలీవుడ్) ఏప్రిల్ 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *