Impact of OTT companies on theatres
1 min read
Impact of OTT companies on theatres.
Movies are coming to OTT within a few days of their release
విడుదలైన కొన్ని రోజుల్లోనే OTT లోకి వచ్చేస్తున్న సినిమాలు.
థియేటర్లకి మొహం చాటేస్తున్న ప్రేక్షకులు.
థియేటర్లపై OTT సంస్థల ప్రభావం.
ఈ మధ్య చిన్న సినిమాలతో పాటు పెద్ద పెద్ద బ్యానర్ లో విడుదలైన సినిమాలు కూడా ఒప్పందం ప్రకారం కాకుండా ముందుగానే OTT లోకి వచ్చేస్తున్నాయి. మొన్న హీరో సత్య దేవ్ నటించిన కృష్ణమ్మ సినిమా విడుదల అయిన కొద్ది రోజులకే OTT లోకి ఎలాంటి ప్రచారం లేకుండా వచ్చేసింది. ఇక్కడ ఇంకొక కొత్త దోరణి ఆచరణలోకి వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే OTT సంస్థలే చిన్న చిన్న సినిమాల నిర్మాణ బాధ్యతని మోస్తున్నాయి.
ఎందుకంటే అటు నిర్మాతగా సినిమాని కొత్తవాళ్ళతో తక్కువ ఖర్చుతో నిర్మించి విడుదల చేస్తున్నారు. సినిమా ఆడకపోయినా భారీగా నష్టాలు చూసే అవకాశం లేదు. అలాగే పరిస్థితిని బట్టి సినిమా కి జనాలు థియేటర్లకి రాకపోయినా, త్వరగా వాళ్ళ OTT లో సినిమా ని విడుదల చేసి కొంత వరకు నష్టాలను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకొక్క సారి థియేటర్లలో జనాదరణ పొందని సినిమాలు కూడా OTT ట్రేండింగ్ లో ఉంటూ తక్కువ సమయంలో మిలియన్స్ వ్యూస్ ని సంపాదించుకుంటుంది. నిర్మాతలు త్వరగా OTT లో విడుదల చేయడానికి ఇదొక కారణం. OTT సంస్థలు కూడా అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అని చెప్పొచ్చు.
ఇందుకు మంచి ఉదాహరణ హీరో సుహాస్ గురించి మాట్లాడితే, సుహాస్ సినిమాలు ఈ మద్య దాదాపుగా ఆహా OTT వేదికగా విడుదల అవుతున్నాయి. సినిమా హిట్ లేక ప్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు అందులోనే విడుదల చేస్తున్నారు. కలర్ ఫోటో సినిమాతో మొదలై తాజా గా విడుదల అయిన ప్రసన్న వదనం, శ్రీ రంగ నీతులు వరకు ఆహాలో మాత్రమె విడుదల అవుతున్నాయి.
ఇప్పుడు మాస్ క దాస్ అని పిలువబడే విశ్వక్ సేన్ తాజా చిత్రం గాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ott లోకి వచ్చేసింది. విడుదలైన 15 రోజులకే ప్రముఖ ott సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ రోజు జూన్ 14 నుండి అందుబాటులోకి వచ్చేసింది. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత గా ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించలేక పోయింది. దీనితో సితార ఎంటర్తైన్మెంట్ వారు త్వరగానే ott ద్వారా ఈ సినిమాని ప్రేక్షకుముందుకు తీసుకొచ్చారు. థియేటర్లలో చూడలేకపోయిన వాళ్ళు నెట్ ఫ్లిక్స్ వేదికగా చూడొచ్చు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నేహ శెట్టి, అంజలి ముఖ్య పాత్రల్లో నటించారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
అలాగే దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి నటించిన లవ్ మి – ఇఫ్ యు డేర్ OTT లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ద్వారా దిల్ రాజు తన మేనల్లుడిని తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో ఈ సినిమా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రముఖ OTT సంస్థ అయిన ప్రైం విడియోలో అందుబాటులో ఉంచారు. ఈ సినిమా థియేటర్లో విడుదలై 3 వారాలు మాత్రమె అవుతోంది. ఈ సినిమాలో బేబీ ఫెమ్ వైష్ణవి చైతన్య హిరోయిన్ గా నటించింది.
ఇలా స్టార్ హీరోల సినిమాలు తప్ప దాదాపుగా అన్ని సినిమాలు అనుకున్నదానికంటే ఎన్టీఆర్ముందుగానే OTT లో దర్శనమిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ ఒరవడికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. థియేటర్ కి వెళ్లి చూసేకంటే కొన్ని రోజులు ఆగితే ఎలాగూ OTT లోకి వచ్చేస్తుంది ఫ్యామిలి, ఫ్రెండ్స్ తో కలిసి చూడొచ్చు అని భావిస్తుండటం వల్ల, మునుపటిలా ప్రేక్షకులతో కిక్కిరిసే థియేటర్లను చూడలేకబోతున్నాం.
