May 13, 2025

Digital Mixture

Information Portal

Will Kalki 2898 AD rake 1000 crores in India alone…

1 min read
Kalki 2898 AD,

Kalki 2898 AD

ఇప్పటి వరకు ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నీ Kalki 2898 AD  తర్వాతేనా…

ఇప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమ మొత్తం కల్కి (Kalki) 2898 AD గురించే మాట్లాడుకుంటోంది. పాన్ ఇండియా స్థాయి కి మించి ఈ సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తె అర్ధమవుతుంది.

తాజాగా ఈ సినిమా ప్రి రిలీజ్ కార్యక్రమం  ముంబై వేదికగా జరిగింది. ఇప్పుడు ఈ సినిమా పై అంచనాలు పెరిగేలా సెన్సార్ టాక్ కూడా బయటకి వచ్చేసింది. ఈ సినిమాకి U / A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సినిమా నిడివి  దాదాపు 3 గం. ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు  ఒక వార్త సినిమా పరిశ్రమ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా సెంటిమెంట్ మరియు విజువల్స్ వండర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొన్ మధ్య జరిగే  సెంటిమెంట్ సన్నివేశాలు ఆకట్టుకునేల ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే సినిమా కథకి తగ్గ  సెట్టింగులు, VFX ఇలాంటివి ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నట్టు తెలుస్తోంది. భైరవ పాత్రలో ప్రభాస్ గురించి ఎక్కువగా బయటకి రాకపోయినా, ప్రభాస్ పోరాట సన్నివేశాలు అదిరిపోయాయని, అవి థియేటర్లో సినిమా చూసి అనుభూతిని పొందాలని తెలుస్తోంది.

అయితే కల్కి 2898 AD సినిమాలో ఉన్న సెంటిమెంట్, పోరాట సన్నివేశాలు, VFX అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకంటే ఈ సినిమా ఒక్క ఇండియా లోనే  సునాయాసంగా 1000 కోట్లు దాటుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

కల్కి 2898 AD దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాగ అశ్విన్ చేసినవి రెండు సినిమాలు మాత్రమె. ముంబై లో జరిగిన కల్కి 2898 AD ప్రీ రిలీజ్ వేదిక పైన ఇందులో నటించిన సూపర్ స్టార్స్ అందరు నాగ్ అశ్విన్ ని మెచ్చుకోవడం జరిగింది. కథ, కథనం, పాత్రలు అన్నిటిని చాలా జాగ్రత్తగా చేసాడని చెప్పడం జరిగింది. ఈ సినిమా రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. అలాగే మొదటి భాగం కల్కి 2898 AD ఈ నెల జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ప్రభాస్ కి  ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా విడుదల దరిదాపుల్లో కూడా ఎవరు తమ సినిమాని విడుదల చెయ్యట్లేదు. కల్కి 2898 AD ఒక్క తెలుగు స్టేట్స్ తెలంగాణ, ఆంధ్ర లో దాదాపుగా 800 నుండి 900 థియేటర్లో విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంటే థియేటర్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పడుకొన్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ టాకూర్ కూడా సినిమాలో కనిపిస్తారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజం అనేది సినిమా విడుదల తరవాతే తెలుస్తుంది.

Watch KALKI 2898 AD Release Trailer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *